ఇన్నోవా క్రిస్టాలో చీపెస్ట్ వేరియంట్ విడుదల

Sunday, March 3, 2019 05:00 PM Automobiles
ఇన్నోవా క్రిస్టాలో చీపెస్ట్ వేరియంట్ విడుదల

జపాన్ దిగ్గజం టయోటా కిర్లోస్కర్ మోటార్ ఇండియా దేశీయ మార్కెట్లోకి లాంచ్ చేసిన ఇన్నోవా క్రిస్టా మోడల్ సృష్టించిన అలజడి అంతా ఇంత కాదు. అనతి కాలంలో భారీ విజయాన్ని అందుకొని భారతీయుల అభిమానాన్ని చూరగొంది. టయోటా ఇప్పుడు సరికొత్త ఇన్నోవా క్రిస్టా మోడల్‌ను మరో కొత్త వేరియంట్లో లాంచ్ చేసింది. కంపెనీ విడుదల చేసిన ఇన్నోవా క్రిస్టా 7-సీటర్ జీ+ వేరియంట్ ధర రూ. 15.57 లక్షలు మరియు 8-సీటర్ జీ+ వేరియంట్ ధర రూ. 15.62 లక్షలు. అన్నిధరలు ఎక్స్-షోరూమ్‌గా ఇవ్వబడ్డాయి.

టయోటా ఇన్నోవా క్రిస్టా మోడల్‌లో లభించే పలు వేరియంట్లలో జీ+ అన్నింటి కంటే ప్రారంభ వేరియంట్. దీనిని వ్యక్తిగత మరియు వ్యాపార అవసరాల రీత్యా మార్కెట్లో అందుబాటులో ఉంచినట్లు కంపెనీ ప్రతినిధులు పేర్కొన్నారు. ఇన్నోవా క్రిస్టా జీ+ వేరియంట్ సాంకేతికంగా అదే మునుపటి 2.4-లీటర్ కెపాసిటీ గల డీజల్ ఇంజన్‌తో లభ్యమవుతోంది. 6-స్పీడ్ స్టాండర్డ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ అనుసంధానం గల ఇది గరిష్టంగా 150బిహెచ్‌పి పవర్ మరియు 343ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!