మారుతికి చుక్కలు చూపించనున్న టాటా కొత్త కారు ఇదే..

దేశీయ దిగ్గజ ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స్ ఈ ఏడాది పండుగ సీజన్ ప్రారంభమయ్యేనాటికి విపణిలోకి మరో కొత్త కారును విడుదల చేసేందుకు ఏర్పాట్లు చకచకా చేస్తోంది. ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్లో అత్యంత ప్రజాదరణ పొందిన మారుతి సుజుకి బాలెనో కారుకు సరాసరి పోటినిచ్చేలా టాటా ఆల్ట్రోజ్ అనే కారును సిద్దం చేసింది. త్వరలో విడుదల ఉన్న నేపథ్యంలో తుది దశ పరీక్షలను రహస్యంగా నిర్వహిస్తుండగా మీడియా కంటపడింది.
టాటా ఆల్ట్రోజ్ కారు ఇండియన్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్లో ఇది వరకే ఉన్న మారుతి సుజుకి బాలెనో, హ్యుందాయ్ ఎలైట్ ఐ20, టయోటా గ్లాంజా మరియు హోండా జాజ్ కార్లకు గట్టి పోటీనివ్వనుంది. అత్యాధునిక డిజైన్ శైలిలో వస్తోన్న టాటా ఆల్ట్రోజ్ ఈ సెగ్మెంట్లో కస్టమర్లను తప్పకుండా ఆకట్టుకోనుంది.
డిజైన్ మరియు ఫీచర్లు పరంగా కాకుండా సాంకేతికంగా కూడా టాటా ఆల్ట్రోజ్ అత్యంత శక్తింవతమైన మోడల్. ఇది మూడు విభిన్న ఇంజన్ ఆప్షన్‌లలో లభ్యం కానుంది. అవి, 1.2-లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ రివట్రాన్ పెట్రోల్, 1.2-లీటర్ రివట్రాన్ టుర్బో-పెట్రోల్ మరియు 1.5-లీటర్ టుర్బో-డీజల్ ఇంజన్.
అన్ని ఇంజన్ ఆప్షన్‌లు 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ అనుసంధానంతో రానున్నాయి. భవిష్యత్తులో ఆటోమేటిక్ గేర్‌బాక్స్ కూడా పరిచయం చేసే అవకాశం ఉంది.