చీపెస్ట్ ధరతో విడుదలైన 7-సీటర్ రెనో ట్రైబర్: బెస్ట్ వేరియంట్ ఏది?

Thursday, August 29, 2019 12:53 PM Automobiles
చీపెస్ట్ ధరతో విడుదలైన 7-సీటర్ రెనో ట్రైబర్:  బెస్ట్ వేరియంట్ ఏది?

రెనో ఇండియా విపణిలోకి సరికొత్త ట్రైబర్ ఎంపీవీ కారును లాంచ్ చేసింది. నాలుగు వేరియంట్లలో లభించే రెనో ట్రైబర్ ధరల శ్రేణి రూ. 495 లక్షల నుండి రూ. 6.49 లక్షల మధ్య ఉంది. ఫీచర్లు మరియు ధర పరంగా రెనో ట్రైబర్ ఎంపీవీలో ఏ వేరియంట్ ఎంచుకుంటే మంచిది..? ధరకు తగ్గ విలువల గల వేరియంట్ ఏది అనే డౌట్ చాలా మందికి ఉంటుంది.

  • రెనో ట్రైబర్ RXE ధర రూ. 4.95 లక్షలు
  • రెనో RXL ధర రూ. 5.49 లక్షలు
  • రెనో EXT ధర రూ. 5.99 లక్షలు
  • రెనో RXZ ధర రూ. 6.49 లక్షలు

అన్ని వేరియంట్ల ధరలు ఎక్స్-షోరూమ్‌గా ఇవ్వబడ్డాయి.

ఒక్కో వేరియంటుకు మధ్య తేడా 50 వేల రూపాయల వరకు ఉంది. టాప్ ఎండ్ వేరియంట్ దాదాపు ఎన్నో కీలకమైన ఇంటీరియర్, ఎక్ట్సీరియర్ ఫీచర్లు, సేఫ్టీ ఫీచర్లు వచ్చాయి. కొసమెరుపు ఏమిటింటే.. ఓ సాధారణం హ్యాచ్‌బ్యాక్ కారు యొక్క స్టార్టింగ్ వేరియంట్ ధరతోనే రెనో ట్రైబర్ టాప్ ఎండ్ వేరియంట్ లభిస్తోంది. కాబట్టి రెనో ట్రైబర్ టాప్ ఎండ్ వేరియంట్ RXZ బెస్ట్ ఛాయిస్ అనేది మా అభిప్రాయం!.


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: