సరికొత్త మారుతి వ్యాగన్ఆర్‌కు భారీ డిమాండ్

Tuesday, February 26, 2019 11:00 AM Automobiles
సరికొత్త మారుతి వ్యాగన్ఆర్‌కు భారీ డిమాండ్

మారుతి సుజుకి జనవరి 23న ఇండియన్ మార్కెట్లోకి సరికొత్త వ్యాగన్ ఆర్ హ్యాచ్‌బ్యాక్‌ను విడుదల చేసింది. మునుపటి మోడల్ వ్యాగన్ ఆర్‌తో పోల్చుకుంటే డిజైన్, ఫీచర్లు, మరియు సేఫ్టీ పరంగా సరికొత్త వ్యాగన్‌ఆర్‌లో భారీ మార్పులు సంభవించాయి. రూ. 4.19 లక్షల ప్రారంభ ధరతో విడుదలైన మారుతి వ్యాగన్ఆర్ కేవలం నెల రోజుల వ్యవధిలోనే వెయిటింగ్ పీరియడ్ 2 నుండి 3 నెలల పెరిగింది. అవును, ఇప్పుడు బుక్ చేసుకునే కస్టమర్లకు సరిగ్గా 2-3 నెలల తర్వాత డెలివరీ చేస్తామని డీలర్లు ప్రామిస్ చేస్తున్నారు.

భారతదేశపు మోస్ట్ పాపులర్ హ్యాచ్‌బ్యాక్ మారుతి సుజుకి వ్యాగన్ఆర్ పలు మార్పులు చేర్పులతో విడుదలయ్యాక అనతి కాలంలో ఊహించని స్పందన లభించింది. మొదటి రెండు మూడు వారాల్లోనే 16,000 యూనిట్ల బుకింగ్స్ నమోదయ్యాయి. 

సరికొత్త మారుతి సుజుకి వ్యాగన్ఆర్ మూడు విభిన్న వేరియంట్లలో లభిస్తోంది. అవి, ఎల్ఎక్స్ఐ, విఎక్స్ఐ మరియు జడ్ఎక్స్ఐ. సాంకేతికంగా ఇది రెండు విభిన్న ఇంజన్ ఆప్షన్‌లలో లభ్యమవుతోంది. అవి, 1.0-లీటర్ మూడు సిలిండర్ల పెట్రోల్ మరియు 1.2-లీటర్ నాలుగు సిలిండర్ల పెట్రోల్ ఇంజన్. వీటిని 5-స్పీడ్ మ్యాన్యువల్ లేదా ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌లతో ఎంచుకోవచ్చు.


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!