మారుతి బాలెనో ఫేస్‌లిఫ్ట్ విడుదల: ధర మరియు పూర్తి వివరాల కోసం...

Tuesday, January 29, 2019 12:00 PM Automobiles
మారుతి బాలెనో ఫేస్‌లిఫ్ట్ విడుదల: ధర మరియు పూర్తి వివరాల కోసం...

దేశీయ అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ దిగ్గజం మారుతి సుజుకి తమ బాలెనో ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ కారును సరికొత్త 2019 బాలెనో ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌లో లాంచ్ చేసింది. మారుతి బాలెనో ఫేస్‌లిఫ్ట్ ప్రారంభ వేరియంట్ ధర రూ. 5.45 లక్షలు మరియు టాప్ ఎండ్ వేరియంట్ ధర రూ. 8.77 లక్షలు ఎక్స్-షోరూమ్(ఢిల్లీ)గా ఉన్న మారుతి ప్రతినిధులు పేర్కొన్నారు.

మారుతి సుజుకి తమ 2019 బాలెనో ఫేస్‌లిఫ్ట్ విడుదలకు వారం క్రితమే రూ. 11,000 ధరతో బుకింగ్స్ కూడా ప్రారంభించింది. ఇప్పటికే బుక్ చేసుకున్న కస్టమర్లకు అతి త్వరలో డెలివరీ ఇవ్వనున్నారు.

మారుతి బాలెనో ఫేస్‌లిఫ్ట్ సిగ్మా, డెల్టా, జెటా, ఆల్ఫా అనే నాలుగు విభిన్న వేరియంట్లలో 1.2-లీటర్ పెట్రోల్ మరియు 1.3-లీటర్ డీజల్ ఇంజన్ ఆప్షన్‌లతో లభ్యమవుతున్నాయి. వీటిని 5-స్పీడ్ మ్యాన్యువల్ లేదా సీవీటీ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో ఎంచుకోవచ్చు. 


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!