భారత్‌ను శాశ్వతంగా వీడునున్న ఫియట్ కార్ల సంస్థ

Saturday, February 2, 2019 01:00 PM Automobiles
భారత్‌ను శాశ్వతంగా వీడునున్న ఫియట్ కార్ల సంస్థ

ఇటలీకి చెందిన దిగ్గజ ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ ఫియట్ మోటార్స్ అతి త్వరలో దేశీయ కార్యకలాపాల నుండి శాశ్వతంగా నిష్క్రమించడానికి సిద్దమవుతోంది. త్వరలో కఠినమైన భద్రత మరియు ఉద్గార నియమాలు తప్పనిసరి కానున్న నేపథ్యంలో ఫియట్ సంస్థ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. దీంతో దేశీయ కార్యకలాపాల నుండి శాశ్వతంగా వైదొలగడం తప్పనిసరేనని తెలుస్తోంది.

ఫియట్ ఇండియా విభాగం ప్రస్తుతం రెండు కార్లను మాత్రమే విక్రయిస్తోంది. అందులో లీనియా ఒకటి కాగా... పుంటో మరొకటి. వీటికి తోడుగా అబర్త్ పుంటో హ్యాచ్‌బ్యాక్ మరియు పుంటో అవెంచురా క్రాసోవర్ మోడళ్లను లాంచ్ చేయాలని భావించింది. అయితే, ప్రస్తుతం ఉన్న మోడళ్లు ఆశించిన ఫలితాలు సాధించకపోవడం ఈ నిర్ణయాన్ని విరమించుకుంది. లీనియా మరియు పుంటో కలిపి డిసెంబర్ 2018  నుండి నవంబర్ 2018 మధ్య కాలంలో కేవలం 101 కార్లను మాత్రమే విక్రయించింది.

లీనియా మరియు పుంటో కార్ల విక్రయాలను విరమించుకుని, తమ ఫియట్ క్రిస్లర్ ఆటోమొబైల్స్‌కు చెందిన జీప్ బ్రాండ్ ఉత్పత్తుల మీద దృష్టిసారించనున్నట్లు గతంలో ఫియట్ ఇండియా ప్రతినిధులు ఓ ప్రకటనలో వెల్లడించారు.


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!